ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- December 11, 2025
కువైట్: కువైట్ నుంచి ఇండిగో KWD 448,793 ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌కు నోటీసులు అందజేశారు. 2021–22 నుండి 2024–25 వరకు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి కువైట్ ట్యాక్స్ క్లెయిమ్‌ల విభాగం మొత్తం KWD 448,793 (₹13.16 కోట్లు) ఆదాయపు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.
డిసెంబర్ 8న కువైట్ తనిఖీ కంట్రోలర్ మరియు యాక్టింగ్ డైరెక్టర్ నుండి ఆర్డర్ అందుకున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ధృవీకరించింది. నోటీసులో నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయిలు మరియు జరిమానాలు రెండూ ఉన్నాయని తెలిపింది. అయితే, ఇప్పటికే చెల్లించాల్సిన ట్యాక్సులను చెల్లించామని, నోటీసులపై త్వరలోనే న్యాయనిపుణులతో సంప్రదిస్తామని వెల్లడించారు. కాగా, ఈ నోటీసులు తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







