ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- December 11, 2025
మస్కట్: ఒమన్‌లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ రియల్ బెనిఫిషియరీ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇది కార్పొరేట్ వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడంలో ఒక ముఖ్యమైన అడుగుగా తెలిపింది. అన్ని లీస్టెడ్ కంపెనీలు కొత్త నిబంధనలకు అనుగుణంగా వారి నిజమైన లబ్ధిదారుల సమాచారాన్ని సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
వాణిజ్య కార్యాకలాపాలపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడం మరియు మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలను పాటించడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒమన్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీలు తమ రికార్డులను వెంటనే అప్డేట్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







