సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- December 11, 2025
రియాద్: సౌదీ అరేబియాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మక్కా, మదీనా, ఖాసిమ్, రియాద్, తూర్పు ప్రావిన్స్ మరియు ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో వడగళ్ళు, బలమైన గాలులతో కూడిన వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) తెలిపింది.
అలాగే, తబుక్ మరియు అల్-జౌఫ్ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, అలాగే రాజ్యంలోని నైరుతి ఎత్తైన ప్రాంతాలలో తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
రెడ్ సీ మీదుగా గంటకు 18-40 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో అరేబియా గల్ఫ్ మీదుగా ఉపరితల గాలులు గంటకు 10-35 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొంది. వీటి కారణంగా అలల ఎత్తు అర మీటర్ నుండి ఒకటిన్నర మీటర్ల వరకు ఉంటుందని, కొన్ని సమయాల్లో రెండున్నర మీటర్లకు పైగా ఉంటుందని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలను ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







