అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- December 14, 2025
మనామా: అక్టోబర్‌లో బహ్రెయిన్ 2.65 బిలియన్ కిలోలకు పైగా వస్తువులను దిగుమతి చేసుకుంది.మొత్తం విలువ సుమారు BD 520 మిలియన్లకు చేరుకుందని ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ విడుదల చేసిన బహ్రెయిన్ ఓపెన్ డేటా పోర్టల్ డేటా తెలిపింది. నమోదైన దిగుమతులు 2.315 బిలియన్ యూనిట్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ముడి పదార్థాలు, పారిశ్రామిక ఉత్పత్తులు మరియు ఆహార వస్తువులతో సహా విభిన్న రకాల వస్తువులు ఉన్నాయని తెలిపారు.అక్టోబర్‌లో బెల్జియం, ఫ్రాన్స్, ఒమన్ సుల్తానేట్ మరియు సోమాలియా నుండి అధికంగా ఎక్స్ పోర్ట్స్ ఉన్నాయని వెల్లడించారు.
అదే సమయంలో ఎగుమతుల్లో ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తులు, పండ్లు మరియు కూరగాయలు, గృహ మరియు సంస్థాగత విద్యుత్ ఉపకరణాలు, ప్లాస్టిక్ వస్తువులు, అలంకార వస్తువులు మరియు ఆభరణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!







