దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!

- December 16, 2025 , by Maagulf
దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!

దోహా: ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) కీలక నిర్ణయం తీసుకుంది. దోహా ప్రాంతంలో ప్రత్యేకంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి షెరటాన్ దోహా హోటల్ వరకు సముద్రయానాన్ని, అలాగే సముద్ర నౌకల లీజింగ్‌ను నిలిపివేయాలని కంపెనీలైన సముద్ర నౌకల యజమానులను కోరింది.

ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలతో పాటు, ప్రజల భద్రత మరియు రక్షణకు మద్దతుగా తీసుకుంటున్న జాతీయ చర్యలలో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. డిసెంబర్ 16ప ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 19 ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పూర్తిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com