అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!

- December 16, 2025 , by Maagulf
అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!

కువైట్: డీజిల్ అక్రమ రవాణాbపై  కువైట్ ఉక్కుపాదం మోపుతోంది.అల్-అబ్దాలీ వ్యవసాయ ప్రాంతంలోని ఒక ఫారమ్‌ను దేశం నుండి డీజిల్ ఇంధనాన్ని నిల్వ చేయడానికి మరియు అక్రమంగా తరలించడానికి ఉపయోగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ఈ ఆపరేషన్ తాత్కాలిక ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది ఇందులో పబ్లిక్ సెక్యూరిటీ వ్యవహారాల సహాయ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమెద్ అల్-దవాస్ పాల్గొన్నారు.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఫారమ్‌లోని కంటైనర్లలో డీజిల్ నిల్వ చేస్తున్నారనే సమాచారం అందగానే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దాడుల్లో అధికారులు డీజిల్‌తో నిండిన 33 కంటైనర్లను, అలాగే ఈ చట్టవిరుద్ధ కార్యకలాపంలో ఉపయోగించిన పంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సూత్రధారిగా భావిస్తున్న ఒక కువైట్ పౌరుడితో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఫారమ్ యజమాని కూడా దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అల్-నువైసీబ్ ఎగ్జిట్ వద్ద పట్టుకున్నారు.పెద్ద మొత్తంలో డబ్బును విదేశాలకు బదిలీ చేసినట్లు సూచించే  బిల్లులను దర్యాప్తు అధికారులు గుర్తించారని, ఇది ఒక స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను సూచిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com