30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!

- December 16, 2025 , by Maagulf
30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!

షార్జా: 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు  నమోదు అయినట్లు షార్జా పోలీసులు తెలిపారు. నవంబర్ 1న షార్జా ఎమిరేట్‌లో లేన్ల వినియోగాన్ని నియంత్రించే చట్టం అమల్లో వచ్చిందని, అప్పటినుండి భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు.  ఈ చట్టం ప్రకారం డెలివరీ బైక్‌లు, భారీ వాహనాలు, మోటార్‌సైకిళ్లు మరియు బస్సుల కోసం నిర్దిష్ట లేన్‌లను మాత్రమే ఉపయోగించాలి. రహదారులపై భద్రతను పెంచడానికి ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

నిర్దేశిత లేన్‌లలో వెళ్లని భారీ వాహనాలకు Dh1,500 జరిమానా మరియు 12 బ్లాక్ పాయింట్లు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు నియమాలను పాటించనందుకు అదనంగా Dh500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. రహదారులపై భద్రతను కాపాడేలా షార్జా పోలీసులు ట్రాఫిక్ పెట్రోలింగ్‌లతో పాటు స్మార్ట్ రాడార్లు, ఆధునిక కెమెరాలను ఉపయోగించి నిఘాను పర్యవేక్షిస్తున్నారు.ట్రాఫిక్ మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ పాటించాలని అధికారులు కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com