MMA ఛాంపియన్‌షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- December 16, 2025
కువైట్: ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మంగాఫ్ (IISM) స్టూడెంట్ అయిన పదమూడేళ్ల భారతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అథ్లెట్ ఇషాక్ ఇంతియాజ్, లెబనాన్‌లోని జౌనీలో జరిగిన ప్రతిష్టాత్మక IMMAF ఆసియా MMA ఛాంపియన్‌షిప్ 2025లో సిల్వర్ మెడల్ సాధించాడు.
ప్రస్తుతం కువైట్‌లో నివసిస్తూ, ఇక్కడే శిక్షణ పొందుతున్న ఇషాక్..యూత్ సి (అండర్ 14) విభాగంలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.52 కిలోల యూత్ సి విభాగంలో పోటీపడిన ఇషాక్.. పాలస్తీనియన్ ప్రత్యర్థిపై విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ఒక తజికిస్తాన్ ఫైటర్‌ను కేవలం 29 సెకన్లలోనే ఓడించి, ఆ విభాగంలోనే అత్యంత వేగవంతమైన సబ్మిషన్‌ను నమోదు చేశాడు. అతని మూడవ మ్యాచ్‌లో లెబనీస్ ప్రత్యర్థిపై విజయాన్ని నమోదు చేశాడు. ఫైనల్‌లో మరో లెబనీస్ ఫైటర్‌తో హోరాహోరీగా జరిగిన పోరులో ఇషాక్ తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు.
ఇషాక్ కువైట్‌లోని ఒక ప్రఖ్యాత MMA శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు. తన కుమారుడి విజయం పట్ల కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిన ఇషాక్ తండ్రి ఇంతియాజ్ హాజా మైదీన్ హర్షం వ్యక్తం చేశాడు. తాము ఇషాక్ పట్ల చాలా గర్వపడుతున్నట్టు చెప్పారు. కేవలం 13 ఏళ్ల వయస్సులో కువైట్‌లో శిక్షణ పొందుతూ సిల్వర్ మెడల్ గెల్వడం నిజంగా ఒక అద్భుతమని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







