వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!

- December 17, 2025 , by Maagulf
వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!

మనామా: కన్నడ సంఘ బహ్రెయిన్ డిసెంబర్ 16న బహ్రెయిన్‌లో అతిపెద్ద వరి మొజాయిక్‌ను సృష్టించడం ద్వారా చరిత్ర సృష్టించింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి అధికారిక గుర్తింపును పొందింది. ఈ రికార్డు ప్రయత్నం బహ్రెయిన్ జాతీయ దినోత్సవ వేడుకలకు ఒక హైలైట్ గా నిలిచింది. 

నేషనల్ డే  రెండు రోజుల ముందు ఈవెంట్‌కు అధికారిక అనుమతి లభించింది. తక్కువ కాలపరిమితి ఉన్నప్పటికీ, రికార్డు ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.  కన్నడ సంఘ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు, వాలంటీర్లు ఉల్లసంఘా పాల్గొన్నారు. 18 మీటర్ల పొడవు మరియు 8 మీటర్ల వెడల్పుతో కూడిన ఈ మ్యాప్ ను వరిధాన్యాలతో రూపొందించారు.   

కన్నడ సంఘ బహ్రెయిన్ అధ్యక్షుడు అజిత్ బంగేరా మాట్లాడుతూ.. ఈ చొరవ బహ్రెయిన్ జాతీయ దినోత్సవాన్ని ప్రత్యేకమైన రీతిలో జరుపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దాదాపు 350 కిలోల బియ్యం గింజలను ఉపయోగించినట్టు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com