ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- December 17, 2025
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తానేట్‌లో అధికారిక రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మస్కట్‌కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో చర్చలు జరపనున్నారు. ప్రధానితో పాటు భారత ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రతినిధి బృందం కూడా రానుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత్ లోని ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షైబానీ తెలిపారు.
మొత్తం ఎగుమతుల పరంగా ఒమన్ సుల్తానేట్‌కు భారత్ ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఫైసల్ అబ్దుల్లా అల్ రోవాస్ తెలిపారు. ఒమన్-భారత సంబంధాలు సక్సెస్ మోడల్ గా ఉన్నాయని, భారత్ ఒమన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నదని వెల్లడించారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







