ఎయిర్ ఇండియాలో కొలువుల పంట
- July 27, 2016
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో కొలువుల పంట పండనుంది. ఎయిర్ ఇండియా విమానాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రెండు మూడేళ్లలో భారీ సంఖ్యలో పైలట్లను, ఇతర సిబ్బందిని నియమించుకోనున్నట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 700 మంది పైలట్లు, 1500మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ (ఆపరేషనల్ ) శివరామకృష్ణన్ పీటీఐకి తెలిపారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకూ 250 మంది పైలట్లను నియమించుకున్నామని, ఇంకా 500మంది అవసరం వుందన్నారు. దీనికి సంబంధించి 400 మంది పైలట్లకోసం ఇప్పటికే నోటిఫికేషన్ వెలువరించామని తెలిపారు. సంస్థ విస్తరణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో మరో 100 విమానాల విస్తరణకు యోచిస్తున్నామన్నారు. గత ఏడాది, ఎయిర్ భారతదేశం 200 ట్రేనీ పైలట్లు (ఎ 320 సీనియర్ ట్రైనీ పైలట్ లైసెన్స్ పొందినవారు) సమీకరణకు కోరగా కేవలం 78 మందిని నియమించుకున్నట్టు చెప్పారు. అలాగే 150 మంది పైలట్లు ఇప్పటికే శిక్షణలో ఉన్నారని, ఈ ఏడాది చివరికి వారి ట్రయినింగ్ పూర్తికానుందని శివరామకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 858 మంది పైలట్లు, మూడువేల మంది ఇతర సిబ్బంది ఉండగా 100 మంది పైలట్లు సంస్థను వీడారని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో శిక్షణ కోసం ఎటీఆర్ సెంటర్ నెలకొల్పేందుకు ప్రయత్ని స్తున్నామని, ఇది వచ్చే జనవరి నాటికి పూర్తికావస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి రూ 65 కోట్లు, భవనం మరియు ఇతర సౌకర్యాల నిర్మాణం కోసం అదనంగా మరో రూ 6 కోట్ల అవసరం ఉంటుందన్నారు. అయితే తమకు విమానాల శిక్షణ సదుపాయం లేనప్పటికీ, పూర్తిగా సొంతమైన అనుబంధ సంస్థ 'అలయన్స్ ఎయిర్' ద్వారా సేవలు అందించనున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







