రామన్ మెగసెసె అవార్డుకు 2016 గాను ఇద్దరు భారతీయులు ఎంపిక
- July 27, 2016
ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో ఒకరు మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్ కాగా, మరొకరు సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ. ఆసియాలో నిస్వార్థ సేవాపరులను గౌరవించటానికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు.
ఈ ఏటి విజేతల విషయానికి వస్తే.. విల్సన్ కర్ణాటకలోని దళిత కుటుంబంలో జన్మించారు. మానవహక్కుల కోసం పోరాడే ఆయన హుందాగా జీవించడం ప్రతి మనిషికి జన్మతో వచ్చిన హక్కు అని చాటుతారు. చెన్నైకి చెందిన టీఎం కృష్ణ సంగీత విద్వాంసులు. సంస్కృతిలో సామాజికాంశాలను సమ్మిళితం చేయడాన్ని ఆయన ఇష్టపడతారు. వీరితో పాటు ఫిలిప్పీన్స్‌కి చెందిన కొంచిత కార్పియోమోరల్స్, ఇండోనేషియాకు చెందిన డంపెట్ దౌఫా తమ తమ రంగాల్లో చేస్తున్న సేవలకు, జపాన్, వియత్నాంలకు చెందిన మరో రెండు సంస్థలకు కూడా ఈ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







