అక్రమ అబార్షన్ చేస్తున్న ఇండియన్ అరెస్ట్
- July 27, 2016
ఇండియాకి చెందిన ఓ వ్యక్తి టెక్నీషియన్ కేటగిరీలో వీసా పొంది, అక్రమంగా క్లినిక్ నడుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కైరవాన్ డిటెక్టివ్స్ ఓ సీక్రెట్ ఆపరేషన్ని నిర్వహించారు. అండర్ కవర్ ఏజెంట్‌ని నిందితుడి వద్దకు పంపగా, నిందితుడు ఆ ఏజెంట్‌కి గర్భస్రావం చేసేందుకు అంగీకరించాడు. దాంతో రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడ్ని డిటెక్టివ్స్ పట్టుకున్నారు. అబార్షన్స్ కోసం వినియోగించే 1050 ట్యాబ్లెట్లను, 483 ఖాళీ సిరంజీలను, 600 యాంప్యూల్స్ని ఈ సందర్భంగా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెక్నీషియన్‌గా జీతం సరిపోకపోవడంతో ఈ అక్రమ సంపాదనా మార్గాన్ని ఎంచుకున్న నిందితుడు, అబార్షన్లు చేస్తూ పెద్ద మొత్తంలో ఆర్జించినట్లు డిటెక్టివ్స్ గుర్తించారు. ఇక్కడ అక్రమంగా గర్భస్రావం చేయించుకున్నవారికి కూడా సమన్లు పంపించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







