జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!

- December 23, 2025 , by Maagulf
జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!

రియాద్: జంతువులను నిర్లక్ష్యం వదిలేయడం, లేదా అనుమతించని ప్రాంతాలలో వాటిని వదలడం సౌదీ అరేబియా చట్టాల ప్రకారం శిక్షార్హమైన ఉల్లంఘన అని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.జంతువులకు తగిన జీవన పరిస్థితులను అందించడంలో విఫలమవడం గల్ఫ్ సహకార మండలి జంతు సంక్షేమ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని అది స్పష్టం చేసింది.

ఈ నిబంధనలు జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి మరియు జంతువులకు హాని కలిగించే లేదా ఆరోగ్యం, పర్యావరణ ప్రమాదాలకు కారణమయ్యే ప్రతికూల పద్ధతులను తగ్గించడానికి ఉద్దేశించినవని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రతి ఒక్కరూ సంబంధిత సూచనలు , నిబంధనలను పాటించాలని సూచించింది. ఈ విషయంలో ఏవైనా ఉల్లంఘనలు గమనించినట్లయితే నివేదించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com