షురా కౌన్సిల్ లో లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై చర్చ..!!
- December 24, 2025
మస్కట్: లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై షురా కౌన్సిల్ ప్రశంసలు కురిపించింది. షురా కౌన్సిల్ పర్యాటక మరియు సంస్కృతి కమిటీ సాధారణ సమావేశం నిర్వహించింది. కమిటీ సమర్పించిన ప్రతిపాదనలకు సంబంధించిన అనేక అభిప్రాయాలను సమీక్షించారు. ఇందులో ప్రజా ప్రయోజనాలకు మద్దతు ఇచ్చే ప్రతిపాదనలను సమర్పించడంలో షురా కౌన్సిల్ చేసిన ప్రయత్నాలను మంత్రిమండలి ప్రశంసించడంపై హర్షం వ్యక్తం చేసింది.
దీర్ఘకాలిక సాంస్కృతిక వీసాను ప్రవేశపెట్టడానికి సంబంధించి తీసుకున్న చొరవపై షురా కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల రాయల్ ఒమన్ పోలీస్ విదేశీయుల నివాసానికి సంబంధించిన కార్యనిర్వాహక నిబంధనలలోని కొన్ని నిబంధనలకు సవరణలు అమల్లోకి వచ్చాయని, ఈ సవరణలో సాంస్కృతిక వీసాకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని, ఇది ఒమన్ సుల్తానేట్‌లో సాంస్కృతిక కార్యకలాపాలను పెంపొందించడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే, ఖురయ్యత్ విలాయత్‌ను సమీకృత పర్యాటక కేంద్రంగా మార్చడానికి సమర్పించిన ప్రతిపాదనపై కమిటీ నివేదికను కూడా సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే తగిన మౌలిక సదుపాయాలను అందించడానికి మద్దతుగా, మొబైల్ హోమ్స్, పర్యాటక సేవల కోసం సమీకృత సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సమర్పించిన ప్రతిపాదనపై తన నివేదికను కమిటీ చర్చించింది. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా హమద్ అల్ హర్తి అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







