వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!

- December 24, 2025 , by Maagulf
వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!

కువైట్: పర్యావరణ పోలీసుల సహకారంతో పర్యావరణ పబ్లిక్ అథారిటీ (EPA) సిబ్బంది వేటగాళ్ల నుండి సముద్రపు పక్షులకు విముక్తి కల్పించారు. సముద్రపు పక్షుల వేటకు సంబంధించి 17 కేసులను నమోదు చేసినట్లు PA పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ షేఖా అల్-ఇబ్రహీం తెలిపారు.EPA మరియు పోలీసు బృందాలు నేరస్థులను అదుపులోకి తీసుకున్నాయని, వారి వద్ద నుంచి పక్షులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు.  

చట్టం 100 ప్రకారం, ఏవైనా అడవి జీవులను వేటాడటం, చంపడం, పట్టుకోవడం, హాని చేయడం లేదా బోనులో బంధించడం నిషేధమని EPA పేర్కొంది. వేటగాళ్లకు గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు KD 500 నుండి KD 5,000 వరకు జరిమానా, లేదా ఈ రెండు శిక్షలలో ఏదో ఒకటి విధించబడుతుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com