E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!

- December 24, 2025 , by Maagulf
E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!

దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) పై ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఆ ప్రమాదానికి డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణమని దుబాయ్ పోలీసులు తెలిపారు.  ఈ కారణంగా వాహనం అదుపుతప్పి కాంక్రీట్ బారియర్‌ను ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారు గాయాలతో బయటపడ్డారని దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.   

ఈ ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూ అలెర్ట్ జారీ చేశారు. బాగా అలసిపోయినప్పుడు, మగతగా ఉన్నప్పుడు లేదా తక్కువ లేదా అధిక బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని, లేదంటే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.  

అయితే, కొందరు డ్రైవర్లు ఇవి చిన్న లక్షణాలే అనుకుంటారని, కానీ డ్రైవర్ కొన్ని సెకన్లలో పూర్తి నియంత్రణను కోల్పోవచ్చని, ఇది వారి జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు. స్పృహ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన కారణాలలో ఒకటి అని ఆయన గుర్తుచేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com