షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ మూసివేత..!!
- December 24, 2025
మనామా: షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు బహ్రెయిన్ ట్రాఫిక్ డైరెక్టరేట్ తెలిపింది. 400 kV విద్యుత్ కేబుళ్ల విస్తరణకు వీలుగా ఈ మూసివేత ఆంక్షలను అమలు చేయనన్నట్లు వెల్లడించింది.
ఈ పనుల కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ నుండి మినా సల్మాన్ దిశగా షేక్ ఇసా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లోకి కుడివైపు తిరిగే చోట ఒక లేన్‌ను దశలవారీగా మూసివేయాల్సి ఉంటుందని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఒక లేన్ లో ట్రాఫిక్ ను అనుమతించనున్నట్లు తెలిపింది.
ఈ మూసివేత ఆంక్షలు డిసెంబర్ 25వతేది రాత్రి 11:00 గంటల నుండి డిసెంబర్ 28 ఉదయం 5:00 గంటల వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







