రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి

- December 24, 2025 , by Maagulf
రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనర్ గొట్టె సుధీర్ బాబు అరుదైన ఘనత సాధించారు. ఆయనకు అదనపు డిజి గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఎపిలో గ్రూప్ వన్ అధికారి ఒకరు అదనపు డిజి హోదా అందుకోవడం ఇ దే తొలిసారి. ఉమ్మడి ఎపిలో 1991లో గ్రూప్ వన్ అధికారిగా పోలీసు శాఖలో నేరుగా డిఎస్పిగా చేరిన ఆయన అనేకచోట్ల పనిచేశారు. సిటీ టాస్ ్క ఫోర్స్ డిసిపిగా, మహబూబ్నగర్ ఎస్పిగా, శంషాబాద్, హైదరాబాద్ పశ్చిమ మండలంతో పాటు ట్రాఫిక్ డిసిపిగా పనిచేసిన ఆయన డిఐజిగా ప దోన్నతి అందుకున్న తరువాత వరంగల్ కమిషనరేటు తొలి కమిషనర్గా పనిచేశారు. అనంతరం ఐజిగా పదోన్నతి అందుకుని నగర ట్రాఫిక్ విభా గం అదనపు పోలీసు కమిషనర్గా, రాచకొండ అదనపు పోలీసు కమిషనర్, కమిషనర్ గా పనిచేసి, మల్టీ జోన్ 1 ఐజిగా సేవలందించారు. రెండేళ్ల క్రితం సుధీర్ బాబును సర్కారు మరో దఫా రాచకొండ పోలీసు కమిషనర్గా నియమించింది. గ్రూప్ వన్ అధికారులు ఇప్పటి వరకు డిఐజి లేదా ఐజిలుగానే పదవీ విరమణ పొందారు. ఎపి, తెలంగాణలో ఈ ఘనత సాధించిన మొదటి అధికారి ఆయనే కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 2001 ఐపిఎస్ బ్యాచ్ అధికారి అయిన సుధీర్ బాబుతో పాటు ఇదే బ్యాచ్కు చెందిన అకున్ సబర్వా ల్కు కూడా సర్కారు అదనపు డిజిగా పదోన్నతి ఇచ్చింది. ఆయన ప్రస్తుతం కేంద్ర సర్వీసులో వున్నారు. వచ్చే జనవరి ఒకటవ తేదీ నుంచి ఇద్దరు అధికారులు ఈ హోదాలో వుంటారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర కేడర్కు చెందిన మరో ఆరుగురు ఐపిఎస్ అధికారులకు డిఐజిగా పదో న్నతి లభించింది. (HYD) ఈ మేరకు ఉత్తర్వులు వెలు వడ్డాయి. 2012 బ్యాచ్ కు చెందిన శ్వేత (హైదరాబాద్ సిసిఎస్ డిసిపిగా ఉన్నారు). ఆర్. భా స్కరన్ (నిఘా విభాగం ఎస్పిగా వున్నారు), చందనాదీప్తి (రైల్వే ఎసిపిగా వున్నారు), కల్మేశ్వర్ సింగన్వార్, రోహిణి ప్రియదర్శిని (కేంద్ర డిప్యూ టేషన్లో వున్నారు), విజయ్ కుమార్ (సిద్దిపేట్ కమిషనర్ ఉన్నారు)లకు డిఐజిలుగా పదోన్నతు లు లభించాయి. వీరంతా వచ్చే జనవరి ఒకటి నుంచి ఈ హోదాలో వుంటారు. అయితే వీరిని కొత్తస్థానాల్లో బదలీ చేయకుండా ఇప్పుడున్న స్థానా ల్లోనే కొనసాగేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com