వైఎస్ జగన్‌కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- December 24, 2025
అమరావతి: వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుతం వైయస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించింది. దీంతో ఇవాళ పులివెందులలో జరగాల్సిన రెండో పర్యటన వాయిదా పడింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని సమాచారం. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
అయితే రెండో రోజైన ఇవాళ పర్యటన జ్వరం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకోవాల్సింది. అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందులకు తిరుగు ప్రయాణమైన భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంగా వాటన్నింటిని వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







