వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి

- December 24, 2025 , by Maagulf
వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి

తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని వయనాడులో ఈరోజు జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) మరియు ఇతర సంబంధిత సంస్థల CMDలతో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజా వినియోగాల పై రుసుములు, సుంకాలు, వినియోగదారు ఛార్జీల విధింపు మరియు నియంత్రణపై చర్చలు జరిపారు.

కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమగ్రంగా చర్చించడం ద్వారా, పౌరులకు మౌలిక సదుపాయాల సరళమైన లభ్యత, సౌకర్యాలు, మరియు పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరల నియంత్రణ పట్ల అవగాహన పెంచడంలో ముఖ్యమైన దశగా ఈ సమావేశాన్ని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com