కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- December 26, 2025
కువైట్: కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ లను నిషేదిస్తూ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ అల్-అవది ఎనర్జీ ఉత్తర్వులను జారీ చేశారు. ఎనర్జీ డ్రింక్స్ అమ్మకం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అమ్మాలని ఉత్తర్వుల్లో సూచించారు. అలాగే, రోజువారీ వినియోగాన్ని ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు డబ్బాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఉత్పత్తిదారులు మరియు దిగుమతిదారులు ఎనర్జీ డ్రింక్ ప్యాకేజింగ్‌పై స్పష్టమైన మరియు ఆరోగ్య సంబంధిత హెచ్చరికలను ముద్రించాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ విద్యా సంస్థలలో, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మరియు యూనివర్సిటీల్లో ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, కిరాణా దుకాణాలు, అన్ని రకాల ఫుడ్ ట్రక్కులు, వెండింగ్ మెషీన్ల ద్వారా ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







