2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- December 26, 2025
దోహా: 2025 ఫిడే ప్రపంచ రాపిడ్ మరియు బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు నేడు దోహాలో ప్రారంభమవుతాయి. డిసెంబర్ 30 వరకు ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్‌కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. పురుషుల రాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 251 మంది ఆటగాళ్లు, మహిళల విభాగంలో 142 మంది పాల్గొంటున్నారు.
ప్రస్తుత క్లాసికల్ ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు, ప్రపంచ నంబర్ వన్ అయిన నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ మరియు 2024 ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్ అయిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాచ్ఛి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ఈ జాబితాలో ఫాబియానో కరువానా, అనిష్ గిరి, వెస్లీ సో, లెవాన్ అరోనియన్ మరియు అలెగ్జాండర్ గ్రిషుక్ కూడా ఉన్నారు. వీరితోపాటు 15 ఏళ్ల రష్యన్ గ్రాండ్‌మాస్టర్ ఇవాన్ జెమ్లియాన్స్కీ మరియు 14 ఏళ్ల టర్కిష్ సంచలనం యాగిజ్ కాన్ ఎర్డోగ్ముస్ కూడా పోటీపడుతున్నారు.
ఇక ఖతార్ తరపున అంతర్జాతీయ మాస్టర్ హుస్సేన్ అజీజ్, ఖలీద్ అల్ జమాత్, హమద్ అల్ కువారీ మరియు ఇబ్రహీం అల్ జనహి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఖతార్ చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అల్ ముదహ్కా తెలిపారు. ఖతార్ చివరిసారిగా 2016లో రాపిడ్ మరియు బ్లిట్జ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహించిందన్నారు. 400 మందికి పైగా చెస్ ప్లేయర్లు పోటీ పడుతున్నారని, మొత్తం బహుమతి నిధి EUR 1 మిలియన్లకు దగ్గరగా ఉంటుందని FIDE అధ్యక్షుడు అర్కాడీ డ్వోర్కోవిచ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







