'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

- December 26, 2025 , by Maagulf
\'భర్త మహాశయులకు విజ్ఞప్తి\' నుంచి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి.

తాజాగా మేకర్స్ క్రిస్మస్ విషెస్ అందిస్తూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ సాంటా క్యాప్ పెట్టుకుని, చేతిలో గిఫ్ట్ పట్టుకుని  ఫెస్టివ్ వైబ్ లో కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది

భర్త మహాశయులకు విజ్ఞప్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్  తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ గా ప్రేక్షకుల్ని అలరించబోతుంది.

జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com