కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!

- December 26, 2025 , by Maagulf
కతారాలో \'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ\' ప్రదర్శన..!!

దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ కతారా..సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ మరియు లెగసీ సహకారంతో “ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 వారసత్వం” ప్రదర్శనను నిర్వహించనున్నది. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఆహ్వానించింది.

ఈ ప్రదర్శన డిసెంబర్ 29న సాయంత్రం 5:30 గంటలకు కతారాలోని బిల్డింగ్ 45లో ప్రారంభమవుతుంది. ఇది ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 సాంస్కృతిక, క్రీడా మరియు సామాజిక వారసత్వాన్ని హైలైట్ చేయనుంది. 

ప్రపంచ కప్ ప్రయాణాన్ని తిరిగి అనుభవించాలనుకునే మరియు ఈ చారిత్రాత్మక సంఘటన ఖతార్ సాంస్కృతిక, క్రీడా రంగాన్ని ఎలా తీర్చిదిద్దుతోందో తెలుసుకోవాలనుకునే సందర్శకులను ఈ ప్రదర్శన ఆకర్షిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com