కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- December 26, 2025
కువైట్: కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లను రద్దు చేశారు.అవి 1996 నాటి చట్టం నంబర్ 28 నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తనిఖీల సందర్భంగా అధికారులు ఉల్లంఘనలను గుర్తించారని తెలిపారు. బాధ్యులపై కేసులను నమోదు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
ఔషధ తయారీ తేదీల్లో అస్పష్టత, వైద్య ఉత్పత్తుల నిబంధనల ఉల్లంఘన, సరైన మెడిసిన్స్ స్టాక్ మెయింటన్ చేయకపోవడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని తన ప్రకటనలో మంత్రిత్వశాఖ తెలిపింది.చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహారిస్తామని, లైసెన్స్‌లను దుర్వినియోగం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







