వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- December 26, 2025
న్యూ ఢిల్లీ: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. వీర్ బాల్ దివాస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు.చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ..పురస్కారాలు అందుకున్న చిన్నారులను అభినందించారు. “మీ విజయాలు దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తాయి. మీ లాంటి ప్రతిభావంతుల వల్లే భారతదేశం ప్రపంచ వేదికపై వెలుగొందుతోంది” అని ఆమె అన్నారు. వైభవ్ తో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 19 మంది చిన్నారులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో వైభవ్ చేసిన ప్రదర్శనతో రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, బిహార్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు. ఆ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశీయ క్రికెట్లో అత్యంత దూకుడు బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.చిన్న వయసులోనే పెద్ద రికార్డులు నెలకొల్పుతూ, భవిష్యత్ భారత క్రికెట్‌కు ఆశాజనకంగా మారాడు. సీనియర్ జట్టులోకి కూడా వైభవ్‌ను తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







