2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..

- December 26, 2025 , by Maagulf
2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..

న్యూ ఢిల్లీ: కొత్త ఏడాది 2026లోకి మరికొద్ది రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం.. కొత్త సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 1, 2016 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఉన్న అనేక రూల్స్, జీతాలు పొందే ఉద్యోగులు, రైతులు, FD రేట్లపై కొత్త విధానాలు, ఆధార్-పాన్ లింకింగ్, 8వ వేతన సంఘం, పీఎం కిసాన్ ఐడీలు, యువతకు సంబంధించి అన్నింటిపై భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుని జేబుకు చిల్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ ఏయే రంగాల్లో ఈ కొత్త నిబంధలు అమల్లోకి రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బ్యాంకింగ్ రంగం:
కొత్త ఏడాది నుంచి అనేక బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు వస్తాయి. క్రెడిట్ స్కోర్ ఏజెన్సీలు ప్రతి 15 రోజులకు ఒకసారి కాకుండా ప్రతి వారం క్రెడిట్ డేటాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. రుణదాతలు తమ రుణగ్రహీతలను అంచనా వేసేందుకు క్రెడిట్ హిస్టరీలను పరిశీలించనున్నారు.

SBI, PNB, HDFC సహా బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. కొత్త సంవత్సరంలో రుణగ్రహీతలకు ఈఎంఐలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు కూడా జనవరి 2016 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు పాన్ ఆధార్ లింకింగ్‌తో పాటు UPI డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశాయి.

జనవరి 1 నుంచి చాలా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలను పొందటానికి పాన్-ఆధార్ లింకింగ్ తప్పనిసరి. లింకింగ్ లేకుండా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలు నిలిపివేయొచ్చు. మోసం దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సిమ్ వెరిఫికేషన్ కూడా కఠినతరం చేశారు.

సోషల్ మీడియా, ట్రాఫిక్ ఆంక్షలు:
ఆస్ట్రేలియా, మలేషియాలోని నిబంధనల మాదిరిగానే 16 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా రూల్స్ కఠినతరం చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వయస్సు ఆధారిత పరిమితులు, తల్లిదండ్రుల నియంత్రణ వంటి చర్చలు జరుగుతున్నాయి. అనేక నగరాలు డీజిల్, పెట్రోల్, కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేయనున్నాయి. ఢిల్లీ నోయిడాలో, కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్ వాహనాలను ఉపయోగించి డెలివరీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com