హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!

- December 26, 2025 , by Maagulf
హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!

మనామా: సెలూన్‌లో హెయిర్ డై చికిత్స తర్వాత తనకు కాలిన గాయాలు మరియు తలపై గాయాలు అయ్యాయని బహ్రెయిన్ మహిళ ఒకరు పరిహారం కొరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.  న్యాయవాది ఫాతిమా అల్-ఖబ్బాజ్ ప్రకారం, ఎనిమిదవ లోవర్ సివిల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో ఆ మహిళ సెలూన్ నుండి BD5,000 నష్టపరిహారం కోరింది. తన జుట్టుకు డై పెట్టిన వెంటనే తనకు మంటగా అనిపించిందని మరియు సెలూన్ ఉద్యోగికి  ఆ విషయాన్ని చెప్పినట్లు, అది సాధారణమని వారు చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అనంతరం అది కాలిన గాయాంతోపాటు జుట్టు కుదుళ్లకు నష్టం కలిగించిందని, తరువాత ప్రత్యేక చర్మవ్యాధి క్లినిక్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపింది. 

కాగా,  సదరు పిటీషనర్ కు జరిగిన గాయాలు కెరాటిన్ చికిత్స వల్ల సంభవించాయని, సెలూన్ అందించిన సర్వీస్ వల్ల కాదని సెలూన్ తరపు న్యాయవాది వాదించారు. ఇటీవల బ్యూటీ సెలూన్‌లో కెరాటిన్ చికిత్స తర్వాత నెత్తిమీద తేలికపాటి కాలిన గాయాల కోసం ఆమె క్లినిక్‌ను సందర్శించినట్లు వైద్య నివేదికలు సమర్పించడంతో కోర్టు పరిహారానికి సంబంధించిన పిటీషన్ ను కొట్టివేసింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com