సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- December 26, 2025
రియాద్: సౌదీ అరేబియాలో 2023-2025 మోడల్స్ కు చెందిన హోండా కార్లను వాణిజ్య మంత్రిత్వ శాఖ రీకాల్ చేసింది. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ యూనిట్ ప్రోగ్రామింగ్‌లో లోపం కారణంగా 2023-2025 మోడల్స్ కు చెందిన 2,239 హోండా అకార్డ్ హైబ్రిడ్ కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ లోపం కారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పవర్ కోల్పోయే అవకాశం ఉందని, ఇది ప్రమాదాలను పెంచుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రీకాల్ సెంటర్‌ను సంప్రదించి, తమ వాహన గుర్తింపు సంఖ్య (VIN) రీకాల్ జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించారు. అవసరమైన అప్డేట్లను ఉచితంగా చేయించుకోవడానికి కంపెనీని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కార్ల యజమానులను కోరింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







