43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!

- December 26, 2025 , by Maagulf
43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!

దుబాయ్: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని దుబాయ్ మెట్రో కార్యకలాపాలను పొడిగించినట్లు దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA)  తెలిపింది. ఈ నేపథ్యంలో డౌన్‌టౌన్ దుబాయ్ మరియు పరిసర ప్రాంతాలలో దశలవారీగా ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నట్లు ప్రకటించింది.

దుబాయ్ మెట్రో రెడ్ మరియు గ్రీన్ లైన్లు, దుబాయ్ ట్రామ్‌తో పాటు  ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా 43 గంటలు నాన్ స్టాప్ గా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 31 ఉదయం 5 గంటల నుండి జనవరి 1 రాత్రి 11.59 గంటల వరకు మెట్రో సేవలు నడుస్తాయి. డిసెంబర్ 31 ఉదయం 6 గంటల నుండి జనవరి 2 తెల్లవారుజామున 1 గంట వరకు దుబాయ్ ట్రామ్ సేవలు అందుబాటులో ఉంటాయని RTAలోని ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ CEO హుస్సేన్ అల్ బన్నా తెలిపారు.   

ప్రధాన ఈవెంట్ జోన్‌ల చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ముఖ్యంగా అల్ అసయేల్ స్ట్రీట్, మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్, బుర్జ్ ఖలీఫా స్ట్రీట్, లోయర్ మరియు అప్పర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్లు, అల్ ముస్తక్బాల్ స్ట్రీట్, అల్ సుకూక్ స్ట్రీట్ మరియు షేక్ జాయెద్ రోడ్ లలో సాయంత్రం 4గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని ప్రకటించారు.  

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డౌన్‌టౌన్ దుబాయ్ చుట్టుపక్కల పార్కింగ్ సామర్థ్యాన్ని విస్తరించారు. బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో సుమారు 20,000 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో స్టేషన్లలో అదనంగా 8,000 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  వీటికి అల్ వస్ల్ క్లబ్ మరియు అల్ కిఫాఫ్ వంటి ప్రదేశాలలో అదనపు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com