మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- December 26, 2025
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ లోని వైద్యులు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న అబ్దుల్ ఖాదీఫ్ (43 సంవత్సరాలు), పురుషుడు అనే రోగికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (LDLT) ను విజయవంతంగా నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.
18 అక్టోబర్ 2025 న నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు ముందు రోగి అడ్వాన్స్డ్ డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ తో బాధపడుతూ, తీవ్రమైన పోర్టల్ హైపర్‌టెన్షన్, భారీ అసైటిస్, జీర్ణాశయ రక్తస్రావం మరియు గ్రేడ్–III హేపాటిక్ ఎన్సెఫలోపతి వంటి ప్రాణాపాయకర సమస్యలను ఎదుర్కొన్నాడు. శస్త్రచికిత్సకు ముందు సుమారు 12 రోజుల పాటు స్పృహలేని స్థితిలో ఉన్న రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండింది.లివర్ పరీక్షల్లో బిలిరుబిన్ స్థాయి 37 mg/dL వరకు పెరగడంతో అత్యవసర లివర్ మార్పిడి అవసరమైంది.
ఈ క్లిష్టమైన లివర్ మార్పిడి శస్త్రచికిత్సను డా.కిషోర్ రెడ్డి, లీడ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో, అనుభవజ్ఞులైన బహుశాఖ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా డా.కిషోర్ రెడ్డి మాట్లాడుతూ...ఇది మేము నిర్వహించిన అత్యంత క్లిష్టమైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేసులలో ఒకటి. రోగి తీవ్ర స్థితిలో ఉన్నప్పటికీ, సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, శస్త్రచికిత్సలో నైపుణ్యం మరియు బహుశాఖ వైద్య బృందం సమన్వయం వల్ల ఈ విజయాన్ని సాధించగలిగాం. చివరి దశ లివర్ వ్యాధిగ్రస్తులకు కూడా సరైన సమయంలో చికిత్స అందితే కొత్త జీవితం ఇవ్వవచ్చు.” అన్నారు.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో డా.కృష్ణగోపాల్ భండారి–కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డా.ఎస్బీఎస్ శ్రీనివాస్–హెడ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియా & లివర్ క్రిటికల్ కేర్ డా.అజయ్ శేశరావ్ షిండే – కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ పాల్గొన్నారు.
లివర్ మార్పిడి అనంతరం రోగిని ట్రాన్స్‌ప్లాంట్ ఐసీయూ లో నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. ప్రారంభ దశలో జ్వరం, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం వంటి సమస్యలు ఎదురైనా, వాటిని వైద్యులు సమర్థవంతంగా నియంత్రించారు.డాప్లర్ పరీక్షలు కొత్త లివర్ సక్రమంగా పనిచేస్తున్నట్టు నిర్ధారించాయి.
దీర్ఘకాల అనారోగ్యం కారణంగా రోగికి కండరాల బలహీనత ఏర్పడినప్పటికీ, ఫిజియోథెరపీ మరియు పునరావాస చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నాడు. డిశ్చార్జ్ సమయంలో రోగి వైద్యపరంగా స్థిరంగా ఉండి, నోటి ద్వారా ఆహారం తీసుకుంటూ పునరావాస చికిత్స కొనసాగిస్తున్నాడు.
ఈ విజయం మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ లోని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం నైపుణ్యం, సమన్వయం మరియు ఆధునిక వైద్య సదుపాయాలకు నిదర్శనంగా నిలుస్తుందని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







