చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- December 27, 2025
చైనా: చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్లను వేరుచేసే తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. షిన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. దీనివల్ల ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గింది. కఠినమైన వాతావరణంలో 5 ఏళ్ల పాటు శ్రమించి చైనా ఇంజనీర్లు ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు.
షిన్జియాంగ్ ప్రాంతంలోని ఉరుమ్కి, కోర్లా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా ఈ మెగా టన్నెల్‌ను నిర్మించారు. డిసెంబర్ 26వ తేదీన ఈ టన్నెల్‌ను అధికారికంగా ప్రారంభించారు. చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ (సీసీసీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు రెండు ప్రపంచ రికార్డులను సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్, అత్యంత లోతైన నిలువు షాఫ్ట్. దీని పొడవు 22.13 కిలోమీటర్లు కాగా.. ఈ ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ కోసం నిర్మించిన అత్యంత లోతైన వర్టికల్ షాఫ్ట్ దాదాపు 706 మీటర్లు ఉంటుంది.
గతంలో ఉరుమ్కి, కోర్లా మధ్య ప్రయాణానికి 7 గంటలకు పైగా పట్టేది. కానీ ఈ టన్నెల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం మూడున్నర గంటలకు తగ్గింది. అంటే ప్రయాణ సమయం సగానికి తగ్గింది. పర్వతాల గుండా వెళ్లే 20 నిమిషాల ప్రయాణమే ఈ మార్పుకు కారణం. సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో.. మైనస్ 42 డిగ్రీల గడ్డకట్టే చలిలో ఈ టన్నెల్ నిర్మించారు. 324.7 కిలోమీటర్ల పొడవైన ఉరుమ్కి-యులి ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఈ టన్నెల్‌ను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 46.7 బిలియన్ యువాన్లు (దాదాపు మన కరెన్సీలో రూ.60 వేల కోట్లు). సాధారణ పద్ధతుల్లో ఈ టన్నెల్ కట్టడానికి 10 ఏళ్లు పట్టేది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







