చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- March 11, 2026
న్యూ ఢిల్లీ: సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎంలలో నగదు డ్రా చేసుకున్నప్పుడు పెద్ద కరెన్సీ నోట్లు మాత్రమే వస్తుంటాయి. ఎక్కువగా రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చిన్న మొత్తాల లావాదేవీలకు అవసరమైన రూ.10, రూ.20, రూ.50 నోట్లు ఏటీఎంలలో లభించకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్న కరెన్సీ నోట్లను కూడా ఏటీఎంల ద్వారా పొందే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చిన్ననోట్ల కొరత ఉందనే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రస్తుత సంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మెషీన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మెషీన్ల ద్వారా రూ.10, రూ.20, రూ.50 నోట్లు నేరుగా డ్రా చేసుకునే వీలుంటుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో చిన్న కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.
- రూ.10 నోట్లు – రూ.439.4 కోట్ల విలువ
- రూ.20 నోట్లు – రూ.193.7 కోట్ల విలువ
- రూ.50 నోట్లు – రూ.130.3 కోట్ల విలువ
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే చిన్న మొత్తాల లావాదేవీల్లో ఎదురయ్యే చిల్లర సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







