ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- March 11, 2026
రియాద్: మార్చి 15 వరకు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ కోరింది.
ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రదేశాలతోపాటు లోయలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. వివిధ మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జారీ అయ్యే సూచనలను పాటించాలని సూచించింది.
మక్కా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే, వడగళ్ళు మరియు దుమ్ము తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉందని డైరెక్టరేట్ పేర్కొంది. రియాద్ ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మదీనా, అల్-బహా, అసిర్, హైల్, తూర్పు ప్రావిన్స్, ఖాసిమ్, నార్తర్న్ బోర్డర్స్, అల్-జౌఫ్ మరియు తబుక్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక నజ్రాన్ మరియు జజాన్ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







