హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- March 11, 2026
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్లో ఉన్న బుర్ఖా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మీర్‌చౌక్ పోలీసుల సమాచారం ప్రకారం షహ్రాన్ మార్కెట్లోని ఒక వాణిజ్య భవనం మూడో అంతస్తులో బుర్ఖా దుకాణం ఉంది. అక్కడ ఉపయోగిస్తున్న మినీ గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన మంటలు క్రమంగా దుకాణంలోని వస్తువులకు వ్యాపించాయి.
అగ్ని ప్రమాదం సమయంలో దుకాణంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంటలు వ్యాపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రంజాన్ మాసం కావడంతో మార్కెట్ ప్రాంతంలో ఎక్కువ రద్దీ ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!







