బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- December 27, 2025
ముంబై: ఆర్బీఐ 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.బ్యాంకు లావాదేవీలు జరిపే కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. జాతీయ సెలవులతో పాటు, ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని సెలవు దినాల్లో రెండు రాష్ట్రాల మధ్య స్వల్ప తేడాలు ఉన్నాయి. ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు కాగా, వాటికి అదనంగా ఈ సెలవులు వర్తిస్తాయి. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం సెలవు రోజుల్లోనూ నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. 2026లో దీపావళి నవంబర్ 8న ఆదివారం రావడం గమనార్హం.
జనవరి 15: మకర సంక్రాంతి, జనవరి 26: గణతంత్ర దినోత్సవం, మార్చి3: హోలీ, మార్చి 19: ఉగాది, మార్చి 20: రంజాన్ (ఆంధ్రప్రదేశ్), మార్చి 21: రంజాన్ (తెలంగాణ), మార్చి27: శ్రీరామ, నవమి, ఏప్రిల్1: వార్షిక ఖాతాల ముగింపు, ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి, మే1: మేడే, మే27: బక్రీద్, జూన్ 25: మొహర్రం (ఆంధ్రప్రదేశ్), జూన్26: మొహర్రం, (తెలంగాణ), ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 25: మిలాద్ ఉన్ నబీ (ఆంధ్రప్రదేశ్)ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబీ (తెలంగాణ), సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి,సెప్టెంబర్ 14: వినాయక చవితి, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 20:విజయదశమి, నవంబర్ 24: గురునానక్ జయంతి (తెలంగాణలో మాత్రమే), డిసెంబర్ 25: క్రిస్మస్
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







