జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- December 28, 2025
రియాద్: జీసీసీ రైల్వే ప్రాజెక్టులలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి అధ్యయనం కోసం కువైట్ అగ్నిమాపక దళం(కెఎఫ్ఎఫ్) ప్రతినిధి బృందం గత వారం సౌదీ అరేబియాను సందర్శించింది. ఈ బృందానికి కువైట్ అగ్నిమాపక దళం సివిల్ ప్రొటెక్షన్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ బ్రిగేడియర్ ఒమర్ హమద్ నాయకత్వం వహించారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రతినిధి బృందం సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులతో సమావేశమయ్యారు.
వీరిలో సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ హమౌద్ బిన్ సులేమాన్ అల్-ఫరాజ్ మరియు సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అజాబ్ అల్-హర్బీ ఉన్నారు. సౌదీ అరేబియా మెట్రో మరియు రైల్వే నెట్‌వర్క్‌లోని తాజా ఫైర్ నివారణ మరియు భద్రతా పద్ధతుల నుండి నేర్చుకోవడం మా సందర్శన ఉద్దేశ్యం అని కువైట్ ప్రతినిధి బృందం తెలిపింది.
కువైట్ ప్రతినిధి బృందం అనేక మెట్రో స్టేషన్లు మరియు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్)లలో పర్యటించింది. అత్యాధునిక అగ్నిమాపక నివారణ టెక్నాలజీ, అత్యవసర రెస్పాన్స్ విధానాలు మరియు క్విక్ భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించడానికి వారు ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు టెక్నాలజీ బృందాలతో సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







