ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- December 29, 2025
దోహా: ప్రజా భద్రతను పెంపొందించడానికి, అదే సమయంలో ముందస్తుగా ప్రమాదాలను నివారించడానికి ఖతార్ ఇంటిరియర్ మినిస్ట్రీ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. మూసిఉన్న గది లేదా సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాలలో మంటలు లేదా బొగ్గును ఉపయోగించకుండా ఉండాలని నివాసితులను కోరింది. వీటిని ఇంటి లోపల ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య మరియు భద్రతా ప్రమాదాలు సంభవిస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యంత విషపూరిత వాయువు కార్బన్ మోనాక్సైడ్ తీవ్ర అనర్థాలకు కారణం అవుతుందని తెలిపింది.
క్లోజ్డ్ గదులు, టెంట్లు, కారవాన్లు మరియు పరిమిత వెంటిలేషన్ ఉన్న మజ్లిస్ ప్రాంతాలు వంటి మూసివున్న ప్రదేశాలలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తన సోషల్ మీడియాలో అకౌంట్లో పేర్కొంది. ఇంటి లోపల ఫైర్ లేదా బొగ్గు వాడకాన్ని నివారించడం వల్ల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు మరియు విష వాయువుల వంటి సంఘటనలను గణనీయంగా తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







