పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- December 30, 2025
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి అని వెల్లడించింది.దీని చివరి గడువు డిసెంబర్ 31, 2025. గడువు ముగిసిన తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు జనవరి 1, 2026 నుండి పనిచేయవు.
లింక్ చేయకపోతే ₹1,000 జరిమానా విధించబడుతుంది.అలాగే, పాన్ ఆధార్ లింక్ కానివాటికి బ్యాంక్ లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, క్రెడిట్, పన్ను రిటర్న్ ఫైలింగ్ వంటి ఆర్థిక కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తవచ్చు.
మీరు మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్‌ను http://www.incometax.gov.inవెబ్సైట్ లేదా SMS ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. SMS కోసం [ఆధార్ నంబర్] [పాన్ నంబర్] 567678/56161 ఫార్మాట్లో పంపాలి.
ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యాలు కూడా అందిస్తోంది. సమస్యలు ఎదురైతే ITD హెల్ప్‌లైన్(Helpline) లేదా సపోర్ట్ సెంటర్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ మార్పులతో పాన్ మరియు ఆధార్ అనుసంధానం సులభం అవుతుంది, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.
తాజా వార్తలు
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!







