యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- December 30, 2025
తెలంగాణ: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ అన్వేష్‌పై తీవ్ర నిరసనలు చోటు చేసుకున్నాయి.ములుగు జిల్లా మంగపేటలో జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ సెంటర్ వద్ద నిరసనకు దిగుతూ, అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఆయన వ్యాఖ్యలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రావుల జానకిరావు మాట్లాడుతూ, హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన తప్పిదమని అన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్వేష్‌ను అరెస్ట్ చేయాలని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, యూట్యూబ్ వేదికగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అన్వేష్ నడుపుతున్న యూట్యూబ్ చానల్‌ను వెంటనే నిషేధించాలని కూడా బీజేపీ నేతలు కోరారు. ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







