రికార్డు సృష్టించిన ‘జన నాయగన్’ ఈవెంట్
- December 30, 2025
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో విజయ్ క్రేజ్ మరోసారి ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడిగా మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా విజయ్‌పై అభిమానుల్లో అపారమైన నమ్మకం ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మలేషియాలో నిర్వహించిన మూవీ ఆడియో లాంచ్ వేడుక మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్రను సృష్టించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ప్రసిద్ధ బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో ఈనెల 27న జరిగిన ఈ వేడుకకు అభిమానులు పోటెత్తారు. దాదాపు 85,000 మంది హాజరైనట్లు నిర్వహాకులు వెల్లడించారు. మలేషియా గడ్డపై ఒక భారతీయ సినిమా వేడుకకు ఈ స్థాయిలో జనం రావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఈవెంట్ ‘మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఈ వేడుకలో విజయ్ స్పందన అభిమానులను మరింత ఉర్రూతలూగించింది. స్టేడియం నిండా గర్జించిన అభిమానుల నినాదాలతో విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అభిమానులను కదిలించింది. ‘‘ఇంతకాలం నా సినిమాలను ఆదరించిన అభిమానుల కోసం నేను మరో 30 ఏళ్లు నిలబడతా. మీ కోసం, మీ సేవ కోసమే సినిమాలకు స్వస్తి పలుకుతున్నాను’’ అంటూ ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







