వచ్చే వారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నా రాజ్‌నాథ్‌సింగ్‌

- July 27, 2016 , by Maagulf
వచ్చే వారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నా రాజ్‌నాథ్‌సింగ్‌

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చే వారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో పాక్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్‌ సమావేశాలకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు. ఇటీవల కశ్మీర్‌ అల్లర్ల నేపథ్యంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌నాథ్‌ పాక్‌ పర్యటన ఉత్కంఠను రెకెత్తిస్తోంది.
ఉగ్రవాద సంస్థ హిబ్జుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానీని భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కశ్మీర్‌ లోయ కల్లోలంగా మారింది. ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన పాక్‌ ప్రభుత్వం భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. స్వయానా పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సహా.. పాక్‌ నేతలు బుర్హాన్‌ వానీని స్వాతంత్య్ర సమరయోధుడితో పోల్చడంతో ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయలకు తెరతీసినట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com