దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి

- December 31, 2025 , by Maagulf
దుబాయ్: \'మా గల్ఫ్\' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి

దుబాయ్: దుబాయ్‌లో మా గల్ఫ్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార & పౌర సంబంధాల (I&PR) శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు స్వదేశ వార్తలను నిష్పక్షపాతంగా, వేగంగా అందించడంలో మా గల్ఫ్ న్యూస్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఆంధ్రప్రదేశ్‌తో మమేకం చేసే వేదికగా మా గల్ఫ్ న్యూస్ ఎదగాలని ఆకాంక్షించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మా గల్ఫ్ న్యూస్ ప్రతినిధులు శ్రీకాంత్ చిత్తర్వు, ప్రదీప్ చెవ్వా, హరీష్ ముక్కర, మంజునాథ్ బెలుపల్లి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ క్యాలెండర్ కొత్త సంవత్సరంలో సామాజిక, సాంస్కృతిక, మీడియా రంగాల్లో స్ఫూర్తినిచ్చే అంశాలతో రూపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రముఖులు, మీడియా ప్రతినిధులు హాజరై, మా గల్ఫ్ న్యూస్ బృందానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్‌లో తెలుగు మీడియా ప్రతిష్టను మరింత పెంచే దిశగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com