ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!

- December 31, 2025 , by Maagulf
ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి.  కొత్త సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికేందుకు యూఏఈ కూడా సిద్ధమైంది. భారీ ఫైర్ వర్క్స్, డ్రోన్ ప్రదర్శనలతో రెడీ అవుతోంది.     

దుబాయ్‌లో 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 40 కి పైగా ప్రదేశాలల్లో ఫైర్ వర్క్స్ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.  బుర్జ్ ఖలీఫాలో లైట్ మరియు లేజర్ షోలు, దుబాయ్ ఫౌంటెన్ ప్రదర్శనలు మరియు డౌన్‌టౌన్ అంతటా భారీ LED స్క్రీన్‌లతో సందడి నెలకొన్నది.  గ్లోబల్ విలేజ్, ఎక్స్‌పో సిటీ దుబాయ్, దుబాయ్ ఫ్రేమ్, ఎమిరేట్స్ గోల్ఫ్ క్లబ్, దుబాయ్ పార్క్‌లు మరియు రిసార్ట్‌ల నుంచి  బుర్జ్ పార్క్‌కు టికెట్ లేకుండా భారీ ఫైర్ వర్క్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.  అలాగే, గ్లోబల్ విలేజ్ మరియు JBR వద్ద ప్రత్యేకంగా డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆర్టీఏ ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచి షేక్ జాయెద్ రోడ్‌లోని ఒక భాగాన్ని మూసివేయనున్నారు. ఈ సదర్భంగా ప్రత్యేకంగా మెట్రో సమయాలను పొడిగించారు.  రెడ్ మరియు గ్రీన్ మెట్రో లైన్లు 43 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయనున్నాయి. జనవరి 2 అర్ధరాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా మెట్రో సేవలు కొనసాగుతాయని ప్రకటించారు.  కాగా, దుబాయ్ మాల్ స్టేషన్ డిసెంబర్ 31న మూసివేస్తారు.

ఇక సొంత వాహనాల్లో వచ్చే నివాసితులు మరియు సందర్శకులు తమ వాహనాలను ఎమ్మార్ ప్రాంతంలో పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 20 వేలకు పైగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెళ్లాల్సిన ప్రదేశాలకు షటిల్ బస్సు సర్వీసులను అందుబాటులో పెట్టారు. దాదాపు 23 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉండనున్నారు.        

అబుదాబి కార్నిచ్ మరియు యాస్ ద్వీపం వంటి ఇతర ఎమిరేట్‌లలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీ ఫైర్ వర్క్స్ నిర్వహించనున్నారు.  అల్ వాత్బాలోని షేక్ జాయెద్ ఫెస్టివల్‌లో నిరంతర 62 నిమిషాల నాన్ స్టాప్ రికార్డు షో ఉంటుంది.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com