రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- December 31, 2025
న్యూ ఢిల్లీ: జనవరి 2026 నుండి UPI (UPI) లావాదేవీల పరిమితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి, అలాగే భద్రతను పెంచడానికి కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేశాయి. జనవరి 2026 నుండి ప్రధాన మార్పులు.. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. సాధారణ వ్యక్తిగత లావాదేవీల (P2P) పరిమితిలో పెద్ద మార్పులు లేకపోయినా కొన్ని ప్రత్యేక కేటగిరీలలో లిమిట్స్ పెరగనున్నాయి.
సాధారణంగా ఒక రోజుకు UPI పరిమితి రూ.1 లక్ష వరకు ఉంటుంది.అయితే 2026 నుండి ఈ లిమిట్ ను రూ.2 లక్షల వరకూ పెంచే అవకాశం ఉంది.అలాగే కొన్నింటికి మినహాయింపులు లేదా పెంపు ఉండవచ్చు. ఆసుపత్రి బిల్లులు , విద్యా సంస్థల ఫీజుల కోసం పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ & ఇన్సూరెన్స్: ఐపీఓ (IPO) సబ్‌స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం కూడా లిమిట్ పెంచాలని పరిశీలిస్తున్నారు. 2. సెకండరీ వెరిఫికేషన్, భద్రత.. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి, మొదటిసారి కొత్త వ్యక్తికి రూ. 2,000 కంటే ఎక్కువ పంపేటప్పుడు 4 గంటల టైమ్ విండో లేదా అదనపు వెరిఫికేషన్ ఉండవచ్చు. దీనివల్ల పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది.పెద్ద మొత్తంలో చేసే పేమెంట్స్ కు అదనపు వెరిఫికేషన్ అవసరం అవ్వొచ్చు. అంటే ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారానే ఎక్కువమొత్తంలో చెల్లింపు చేయగలుగుతారు.
చిన్న చిన్న లావాదేవీల కోసం వాడే UPI Lite పరిమితిని కూడా పెంచే యోచనలో ఉన్నారు. పిన్ ఎంటర్ చేయకుండానే చేసే చెల్లింపుల పరిమితిని రూ. 500 నుండి రూ. 1,000 కి పెంచవచ్చు. ఇకపోతే సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. వేర్వేరు కేటగిరీలకు వేర్వేరు పరిమితులు ఉన్నాయి. పెట్టుబడులు & ఇన్సూరెన్స్: స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ రీపేమెంట్స్ కోసం ఒక్కో లావాదేవీకి పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ విభాగాల్లో రోజువారీ గరిష్ట పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెరిగింది. వీటి రోజువారీ గరిష్ట పరిమితి రూ. 6 లక్షలు. నగల కొనుగోళ్లు: బంగారం లేదా నగలు కొనుగోలు చేసేటప్పుడు ఒక్కో లావాదేవీకి గతంలో ఉన్న రూ. 1 లక్ష పరిమితిని రూ. 2 లక్షలకు పెంచారు. ద
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







