మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- December 31, 2025
మస్కట్: భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టిచ్డ్ షిప్ చారిత్రాత్మకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇండియన్ నావల్ సెయిలింగ్ వెస్సెల్ (INSV) కౌండిన్య గుజరాత్‌లోని పోర్బందర్ నుండి ఒమన్ సుల్తానేట్‌లోని మస్కట్‌కు తన తొలి విదేశీ ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఆధునిక నౌకాదళ నౌకల మాదిరిగా కాకుండా, INSV కౌండిన్యకు ఇంజిన్ ఉండదు. ఆధునిక ప్రొపల్షన్ వ్యవస్థ ఉండదు. ఇది పూర్తిగా గాలి మరియు తెరచాపలపై ఆధారపడి నడుస్తుంది. సహజ రెసిన్, పత్తి మరియు నూనెలను పొట్టును దీని తయారీకి ఉపయోగించారు. సముద్ర ప్రయాణం ద్వారా భారత్ తన పురాతన సముద్ర వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఈ చారిత్రాత్మక యాత్ర ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని అధికారులు తెలిపారు.
పోర్బందర్ నుండి మస్కట్ వరకు ప్రయాణం వాతావరణ పరిస్థితులకు లోబడి దాదాపు 15 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. భారత్ లోని ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ, పశ్చిమ నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు, INSV కౌండిన్య తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. పురాతన స్టిచ్డ్-ఓడ సాంకేతికతను తిరిగి జీవం పోసినందుకు భారత నావికాదళం, డిజైనర్లు, కళాకారులు మరియు నౌకానిర్మాణదారులను ఆయన అభినందించారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







