BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- January 02, 2026
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL దేశవ్యాప్తంగా వినియోగదారులకు VoiceOver WiFi(VoWiFi) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సేవలతో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది.
ఇకపై మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైఫై కనెక్షన్ ఉంటే చాలు, ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ చేయవచ్చని BSNL తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. VoiceOver WiFi టెక్నాలజీ ద్వారా కాల్ డ్రాప్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని, వినియోగదారులకు మెరుగైన కాలింగ్ అనుభవం లభిస్తుందని BSNL స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండోర్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు







