'ది పారడైజ్' నుంచి పవర్ ఫుల్ పోస్టర్ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్
- January 02, 2026
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్' ప్రతి అప్డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది.
మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నాని జడల్ పాత్రలో పవర్ ఫుల్ గా, తన కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతార్ లో కనిపిస్తున్నారు.
స్ట్రాంగ్ ఫిజిక్, పొడవైన జడలు కట్టిన జుట్టు, రగ్గడ్ గడ్డం, మీసాలతో నాని లుక్ అదిరిపోయింది. రెడ్ టింట్ గ్లాసులు, మెటల్ చైన్స్, స్లీవ్‌లెస్ బ్లాక్ అవుట్‌ఫిట్ అతని పాత్రలోని ఇంటెన్సిటీని చూపిస్తోంది.
ఈ పోస్టర్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీన్‌కి సంబధించినది. ఫారిన్ ఫైటర్లతో జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఇది, కథను కీలక మలుపు తిప్పే ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా నిలవనుంది. దసరాతో పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రా, రగ్డ్, రియలిస్టిక్ టోన్‌తో రూపొందిస్తున్నారని ఈ పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ చిత్రానికి సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.
ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ది ప్యారడైజ్ ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే పాన్-వరల్డ్ స్పెక్టకిల్‌గా నిలవనుంది.
తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







