ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- January 06, 2026
మస్కట్: ప్రముఖ భారతీయ నేపథ్య గాయని చిత్ర అయ్యర్, ఒమన్‌లోని జెబెల్ షామ్స్ ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్ ప్రమాదంలో మరణించిన తన సోదరి శారదా అయ్యర్ మరణంపై సంతాపం తెలిపారు. మస్కట్‌లో నివసిస్తున్న 52 ఏళ్ల శారదా అయ్యర్, కేరళలోని తజవాకు చెందిన భారతీయ ప్రవాసి. ఆమె దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్.డి. అయ్యర్ మరియు రోహిణి అయ్యర్ దంపతులకు జన్మించారు. శారదా అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తరలిస్తున్నారు. జనవరి 7న తజవాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తన సోదరి మరణాన్ని ప్రకటిస్తూ, చిత్ర అయ్యర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమేషనల్ పోస్ట్ పెట్టారు. "పరుగెత్తు, సోదరీ! నువ్వు చాలా వేగంగా పరుగెడుతున్నావు! కానీ నేను కూడా కలుస్తాను... ఎప్పటికైనా... త్వరలోనే, వాగ్దానం చేస్తున్నాను," అని ఆమె రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్‌ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







